Rishabh Pant: ఏంటో నా రాత ఇలా తగలడింది! పంత్‌ రియాక్షన్‌ వైరల్‌!

Ind Vs SA: Rishabh Pant Reaction After Losing 5 Consecutive Tosses Viral - Sakshi

Ind Vs SA 5th T20: సీనియర్ల గైర్హాజరీ, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడిన నేపథ్యంలో తొలిసారి టీమిండియా పగ్గాలు చేపట్టే అవకాశం దక్కించుకున్నాడు యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో పంత్‌ సేన ఓటమి పాలైనా.. తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి సత్తా చాటింది. 

తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయితే, వరణుడి ఆటంకం కారణంగా ఆఖరి మ్యాచ్‌ రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే.. అతి పిన్న వయస్సులోనే భారత జట్టుకు సారథ్యం వహించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన 24 ఏళ్ల రిషభ్‌ పంత్‌ను ఒక విషయంలో మాత్రం దురదృష్టం వెంటాడింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐదుసార్లూ పంత్‌ టాస్‌ ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన సమయంలో పంత్‌ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఏంటో నా తలరాత ఇలా తగలడింది... అంటూ ఏడ్వలేక నవ్వుతున్నట్లు ఉంది పంత్‌.. నీ వ్యవహారం. టాస్‌ ఓడితే ఏంటి రెండు మ్యాచ్‌లు గెలిచారు కదా! మూడోది కూడా గెలిస్తే బాగుండేది’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక టాస్‌ గురించి మ్యాచ్‌ అనంతరం పంత్‌ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో ఎక్కువసార్లు ఇలాగే జరిగింది అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా మొదటి నాలుగు మ్యాచ్‌లలో ప్రొటిస్‌ కెప్టెన్‌ తెంబా బవుమా.. ఐదో మ్యాచ్‌లో అతడి స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన కేశవ్‌ మహరాజ్‌ టాస్‌ గెలిచారు. ఇక వర్షం కారణంగా 3.3 ఓవర్లకే ఐదో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.​ ఈ మ్యాచ్‌ అనంతరం పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సహా ఇంగ్లండ్‌ టూర్‌కు పయనమయ్యారు.

చదవండి: ఫామ్‌లో లేని పంత్‌.. టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడా?.. అదైతే కష్టం కానీ: ద్రవిడ్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top