దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. వారిద్దరూ దుమ్మురేపుతారు: సునీల్ గవాస్కర్ | IND Vs SA Test: Sunil Gavaskar Opines Rohit Sharma And Virat Kohli To Score Lots Of Runs Vs South Africa - Sakshi
Sakshi News home page

Sunil Gavaskar: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. వారిద్దరూ దుమ్మురేపుతారు

Published Mon, Dec 25 2023 7:23 PM

IND vs SA: Gavaskar opines Rohit Sharma and Virat Kohli to score lots of runs - Sakshi

సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌-26 నుంచి దక్షిణాఫ్రికా-భారత్‌ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికా,భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. తమ సొంత గడ్డపై టెస్టుల్లో భారత్‌పై అధిపత్యాన్ని చెలాయించాలని సౌతాఫ్రికా భావిస్తుంటే.. టీమిండియా మాత్రం తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కసితో ఉంది. 

ఈ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అందుబాటులో ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఈ సీనియర్‌ ద్వయంకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్‌ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో 'విరోహిత్‌'ను ఉద్దేశించి భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రోటీస్‌ సిరీస్‌లో విరాట్‌, రోహిత్‌ పరుగులు పరుగుల వరద పారిస్తారని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం జట్టులో విరాట్‌, రోహిత్‌ శర్మ చాలా  అనుభవజ్ఞులైన బ్యాటర్లు. వారిద్దరికి దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. కాబట్టి ఈ టెస్టు సిరీస్‌లో వారిద్దరూ భారీగా పరుగులు సాధిస్తారని నేను భావిస్తున్నాను. ఈసారి దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎటాక్‌ కొంచెం వీక్‌గా ఉంది. ఈ సిరీస్‌కు సీనియర్‌ పేసర్లు నోర్జే, లుంగి ఎంగిడీ దూరమయ్యారు. రబాడ అందుబాటుపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ చేసే అవకాశముందని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!

Advertisement
 
Advertisement