టాస్‌ ఓడిన టీమిండియా.. ఆసీస్‌ విధ్వంసకర వీరుడి రీఎంట్రీ | Sakshi
Sakshi News home page

IND VS AUS 2nd T20: టాస్‌ ఓడిన టీమిండియా.. ఆసీస్‌ విధ్వంసకర వీరుడి రీఎంట్రీ

Published Sun, Nov 26 2023 6:45 PM

IND VS AUS 2nd T20: Australia Won The Toss And Opt To Bowl - Sakshi

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్‌, ఆరోన్‌ హార్డీ స్థానాల్లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా ఆసీస్‌ జట్టులోకి వచ్చారు.   

టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్‌), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement