ICC Sets August 29 as World Cup 2023 Squad Submission Deadline - Sakshi
Sakshi News home page

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక అప్‌డేట్‌

Jun 25 2023 3:40 PM | Updated on Jun 25 2023 5:19 PM

ICC sets August 29 as World Cup 2023 squad submission deadline - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 భారత్‌ వేదికగా ఆక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ జూన్‌ 27ను ముంబైలో ప్రకటించింది. షెడ్యూల్‌ను దాదాపు 100 రోజులు ముందు ఐసీసీ వెల్లడించనుంది.

అయితే ఐసీసీ డ్రాప్ట్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ మెగా టోర్నీ ఆక్టోబర్‌ 5 నుంచి షూరూ కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో పాల్గోనే జట్లు తమ పూర్తి వివరాలను ప్రకటించడానికి ఆగస్టు 29 డెడ్‌లైన్‌గా విధించాలని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఆయా జట్లు తమ జట్లను ఖారారు చేయడానికి ఇంకా దాదాపు రెండు నెలల సమయం మిగిలి ఉంది.

మరో 60 రోజులు..
టోర్నీలో పాల్గోనే జట్లు తమ వివరాలను సమర్పించడానికి ఐసీసీ గడువు విధించడంతో.. బీసీసీఐకి భారత చీఫ్ సెలెక్టర్‌ని నియమించడానికి ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

ఫిబ్రవరిలో చేతన్‌ శర్మ సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాలుగు నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది. అనంతరం చేతన్‌ శర్మ స్థానంలో సెలక్షన్‌ ప్యానల్‌లో సభ్యుడైన శివ్‌సుందర్‌ దాస్‌ను తాత్కాలిక ఛీప్‌ సెలెక్టర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఈ ఏడాది జరగనున్న ఆసియకప్‌కు ముందే బీసీసీఐకు కొత్త చీఫ్ సెలెక్టర్‌ వచ్చే ఛాన్స్‌ ఉ‍ంది.
చదవండి#1983WorldCup: చరిత్రకు 40 ఏళ్లు.. 35,000 వేల అడుగుల ఎత్తులో స్పెషల్‌ సెలబ్రేషన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement