చరిత్రకు 40 ఏళ్లు.. 35,000 వేల అడుగుల ఎత్తులో స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ | Sakshi
Sakshi News home page

#1983WorldCup: చరిత్రకు 40 ఏళ్లు.. 35,000 వేల అడుగుల ఎత్తులో స్పెషల్‌ సెలబ్రేషన్స్‌

Published Sun, Jun 25 2023 2:21 PM

India legends celebrate 40th anniversary of 1983 Lords miracle 35,000 feet up in the air - Sakshi

టీమిండియా తొలి ప్రపంచకప్‌ను సాధించి నేటికి 40 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1983 వన్డే ప్రపంచకప్‌లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. ఫైనల్లో పటిష్ట వెస్టిండీస్‌ను ఓడించి ఛాంపియన్స్‌గా నిలిచింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కపిల్‌ డేవిల్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఒక్క విజయంతో ప్రపంచక్రికెట్‌లో తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు భారత జట్టు ఏర్పరుచుకుంది.

స్పెషల్‌ సెలబ్రేషన్స్‌.. 
ఇక తొలి ప్రపంచకప్‌ సాధించి 40 వసంతాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని 1983 భారత హీరోలు మళ్లీ ఒక్క చోట చేరి సంబరాలు జరపుకున్నారు. వరల్డ్‌కప్‌ జట్టులో భాగమైన లెజెండ్స్‌ ఓ మినీ ఎయిర్‌ క్రాప్ట్‌లో స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ హీరోస్‌లో ఒకడైన కీర్తి ఆజాద్‌ సోషల్‌ మీడియలో షేర్‌ చేశాడు. ఇందులో కపిల్‌ దేవ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, శ్రీకాంత్‌, సందీప్‌ పాటిల్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌, మదన్‌ లాల్‌, సయ్యద్‌ కిర్మాణి, బల్విందర్‌ సింగ్‌, రోజర్‌ బిన్నీలు ఉన్నారు.

"35,000 వేల అడుగుల ఎత్తులో 1983 వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌ టీమ్‌ 40వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోంది. భారతీయుడుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. లవ్‌ ఇండియా, భారత్‌ మాతాకీ జై "అంటూ కీర్తి ఆజాద్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

మరోవైపు అదానీ గ్రూప్‌ తమ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 1983 ప్రపంచకప్‌ విజేత ఆటగాళ్లను సత్కరించింది. అదే విధంగా  ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ‘జీతేంగే హమ్‌’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రపంచకప్‌ విన్నింగ్‌ హీరోస్‌ తమ సెలబ్రేషన్స్‌ను జరపుకున్నారు.
చదవండి: #1983WorldCup: రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది

Advertisement
Advertisement