
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అక్రమాల కేసుకు సంబంధించిన వాదనలు మల్కాజిగిరి కోర్టులో ముగిశాయి. నిందితుల తరుపు న్యాయవాదుల వాదనకు కోర్టు ఏకీభవించలేదు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మొత్తం ఐదుగురు నిందితులకు 12 రోజుల రిమాండ్ మల్కాజిగిరి కోర్టు విధించింది.
కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. ఈ నెల 12 వరకు వీరు రిమాండ్‌లో ఉండనున్నారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికలో అక్రమాల కేసులో జగన్మోహన్ రావు అరెస్ట్ చేసినట్లు సీఐడీ గురువారం ఉదయం ప్రకటన విడుదల ప్రకటన చేసింది.