
టీమిండియా యువ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ బుచ్చిబాబు క్రికెట్ టోర్నీలో మెరుపు సెంచరీతో చెలరేగాడు. టీఎన్సీఏ ఎలెవెన్తో జరుగుతున్న మ్యాచ్లో 114 బంతుల్లో 138 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్కు చేరాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కేవలం 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆకాశ్ పార్కర్‌తో కలిసి ఆరో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఆకస్మికంగా మైదానాన్ని వీడాడు.
భారీ పరివర్తన.. 2 నెలల్లో 17 కిలోలు
27 ఏళ్ల సర్ఫరాజ్ ఇటీవల భారీగా బరువు తగ్గాడు. ఓవర్ వెయిట్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న అతడు.. 95 కిలోల నుంచి 78 కిలోలకు చేరాడు. కఠినమైన శారీరక శ్రమ, సమతూకమైన డైట్ను పాటించి రెండు నెలల్లో ఏకంగా 17 కిలోలు తగ్గి ఔరా అనిపించాడు. సర్ఫరాజ్ వెయిట్ లాస్ ప్రక్రియ స్పూర్తిదాయకంగా ఉంది. తండ్రి పర్యవేక్షన, విరాట్ కోహ్లి స్పూర్తితో బరువు తగ్గినట్లు సర్పారాజ్ చెప్పుకొచ్చాడు.
సెలెక్టర్లకు సవాల్
తాజా సెంచరీతో సర్ఫరాజ్ భారత సెలెక్టర్లకు మరోసారి సవాలు విసిరాడు. గత కొంతకాలంగా మంచి ప్రదర్శనలే చేస్తున్నా సర్ఫరాజ్కు టెస్ట్ జట్టులో చోటు దక్కడం లేదు. సీనియర్ల కారణంగా అతనికి అవకాశాలు రావడం లేదు.
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తొలి మ్యాచ్లోనే మెరుపు హాఫ్ సెంచరీ బాది ఆకట్టుకున్నాడు. ఆతర్వాత న్యూజిలాండ్పై 150 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
అయితే సర్ఫరాజ్ సెంచరీ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా 11 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 371 పరుగులు చేశాడు.
టీమిండియాలో సీనియర్లు స్థిరపడటం చేత సర్ఫరాజ్కు సరైన అవకాశాలు రాలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైనా బెంచ్కే పరిమితమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్కు జట్టులో చోటే దక్కలేదు. ఆ సిరీస్కు ముందు సర్ఫరాజ్ ఇండియా ఏ తరఫున ఆడుతూ ఇంగ్లండ్ లయన్స్‌పై 92 పరుగులు చేశాడు. అయినా భారత మిడిలార్డర్ బలంగా ఉండటంతో అతను జట్టుకు ఎంపిక కాలేదు.
ఇంగ్లండ్తో సిరీస్లో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో టీమిండియా తదుపరి ఆడబోయే టెస్ట్ సిరీస్‌ల కోసం సర్ఫరాజ్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు.