క్వార్టర్‌ ఫైనల్లో హుమేరా జోడీ | Humera Jodi in the quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో హుమేరా జోడీ

Oct 10 2024 4:05 AM | Updated on Oct 10 2024 4:05 AM

Humera Jodi in the quarter final

మైసూర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి హుమేరా బహార్మస్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్‌) జోడీ 7–6 (10/8), 6–4తో యశస్విని పన్వర్‌–వన్షిత పథానియా (భారత్‌) జంటపై గెలుపొందింది. 

తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్‌ కూడా డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో స్మతి భాసిన్‌ (భారత్‌)–ఎలీనా జంషీది (డెన్మార్క్‌) ద్వయం 6–4, 6–4తో సోనల్‌ పాటిల్‌ (భారత్‌)–ప్రిషా వ్యాస్‌ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. 

మహిళల సింగిల్స్‌లో అభయ వేమూరి, అపూర్వ వేమూరి తొలి రౌండ్‌లోనే ని్రష్కమించారు. అభయ 4–6, 3–6తో పూజా ఇంగాలె చేతిలో, అపూర్వ 5–7, 2–6తో యశస్విని చేతిలో ఓడిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement