HCA Elections 2023: ప్రశాంతంగా ముగిసిన హెచ్‌సీఏ ఎన్నికల పోలింగ్‌.. గెలిచేదెవరో?

HCA Elections Completed 169 Votes Polled - Sakshi

ఉప్పల్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా..  మొత్తం  173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది.

ఈ నేపథ్యంలో అనేక వివాదాల అనంతరం.. హెచ్‌సీఏ పీఠం ఎవరు దక్కించుకోనున్నారన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. కాగా ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటిగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల అధికారి తొలుత ప్రెసిడెంట్ స్థానానికి ఎన్నికైన అభ్యర్థి పేరునే ప్రకటించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. హెచ్‌సీఏ అధ్యక్ష రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా హెచ్‌సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వీఎస్‌ సంపత్‌ వ్యవహరించారు.

బరిలో ఉన్న ప్యానెల్, అభ్యర్థులు వీరే..
యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ: 
ఎ.జగన్‌మోహన్‌ రావు, పి.శ్రీధర్, ఆర్‌.హరినారాయణ రావు, నోయల్‌ డేవిడ్, సీజే శ్రీనివాస్, అన్సర్‌ అహ్మద్‌ ఖాన్‌. 
క్రికెట్‌ ఫస్ట్‌: అమర్‌నాథ్, జి.శ్రీనివాస రావు, ఆర్‌.దేవరాజ్, సి.సంజీవ్‌ రెడ్డి, చిట్టి శ్రీధర్, సునీల్‌ కుమార్‌.  
ఆనెస్ట్‌ హార్డ్‌ వర్కింగ్‌ హెచ్‌సీఏ: పీఎల్‌ శ్రీనివాస్, సి. బాబూరావు, ఆర్‌ఎం భాస్కర్, రోహిత్‌ అగర్వాల్, జెరార్డ్‌ కార్, డీఏజే వాల్టర్‌. 
గుడ్‌ గవర్నెన్స్‌: కె. అనిల్‌కుమార్, దల్జీత్‌ సింగ్, వి.ఆగమరావు, బసవరాజు, పి.మహేంద్ర, వినోద్‌ ఇంగ్లే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top