డెనిజ్‌ డబుల్‌ ధమాకా.. 12 ఏళ్ల తర్వాత నాకౌట్‌కు జర్మనీ | Germany secures comeback win vs Ivory coast | Sakshi
Sakshi News home page

డెనిజ్‌ డబుల్‌ ధమాకా.. 12 ఏళ్ల తర్వాత నాకౌట్‌కు జర్మనీ

Jun 21 2026 3:51 AM | Updated on Jun 21 2026 11:08 AM

Germany secures comeback win vs Ivory coast

జర్మనీ జట్టు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌కు చేరింది. 2026 ఎడిషన్‌ గ్రూప్‌-ఈలో భాగంగా ఐవరీ కోస్ట్‌పై 2-1 గెలుపుతో సూపర్‌-32కు అర్హత ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో వెనుకబడిన జర్మనీ, సూపర్‌ సబ్‌ డెనిజ్‌ ఉందవ్‌ ద్విగోల్‌ ప్రదర్శనతో నాటకీయ విజయాన్ని అందుకుంది.

30వ నిమిషంలో ఫ్రాంక్‌ కెస్సీ రీబౌండ్‌ను గోల్‌గా మలిచి ఐవరీ కోస్ట్‌కు ఆధిక్యం అందించాడు. 60వ నిమిషంలో బెంచ్‌ నుంచి వచ్చిన డెనిజ్‌ అద్భుతమైన గోల్‌ చేసి స్కోర్‌ సమం చేశాడు. అదనపు సమయంలో మరోసారి గోల్‌ కొట్టిన డెనిజ్‌ జర్మనీకి విజయాన్ని ఖాయం చేశాడు.

ఈ గెలుపుతో జర్మనీ గ్రూప్-ఈలో అగ్రస్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్‌ 32కు అర్హత సాధించింది. 2014లో టైటిల్‌ గెలిచిన తర్వాత జర్మనీ గ్రూప్‌ దశను దాటడం ఇదే మొదటిసారి. ఈ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో జర్మనీ అనామక కురసావోపై 7-1 భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement