టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌.. కానీ ఒకే ఒక‌ కండీష‌న్‌!? | Sakshi
Sakshi News home page

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌.. కానీ ఒకే ఒక‌ కండీష‌న్‌!?

Published Sun, May 26 2024 6:24 PM

Gautam Gambhir Keen To Replace Dravid As Head Coach, Says Report

టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ వేట‌ను మొదులెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ధ‌ర‌ఖాస్తుల‌ను సైతం బీసీసీఐ అహ్హ‌నించింది. హెడ్ కోచ్ ప‌ద‌వికి ధ‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మే 27 సాయంత్రం ఆరు గంట‌ల‌తో గ‌డువు ముగియునుంది. ఈ క్ర‌మంలో హెడ్‌కోచ్ రేసులో గౌతం గంభీర్‌, రికీ పాంటింగ్‌, వీవీఎస్ లక్ష్మణ్,జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్ల పేర్లు వినిపిస్తున్నాయి. 

అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం భార‌త మాజీ ఓపెన‌ర్ గౌతం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. కాగా దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్ర‌కారం.. గంభీర్ కూడా భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే హెడ్‌కోచ్ ప‌దవికి ధ‌ర‌ఖాస్తు చేసేముందు గంభీర్ బీసీసీఐకు ఒక కండీష‌న్ పెట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

'సెలక్షన్ గ్యారెంటీ' ఇస్తేనే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తాన‌ని బీసీసీఐతో గంభీర్ చెప్పిన‌ట్లు దైనిక్ జాగరణ్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన‌ట్లు వినికిడి. ప్ర‌స్తుత స‌మాచారం ప్ర‌కారం ద్ర‌విడ్ వారసుడిగా గంభీర్ బాధ్య‌త‌లు చెపట్ట‌డం దాదాపు ఖాయ‌మ‌న్పిస్తోంది. 

కాగా గంభీర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2024లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్నాడు. ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో కేకేఆర్ త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement