
కొలంబో: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకేను క్రీడా అవినీతి దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. 2020లో జరిగిన లంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లను సంప్రదించి మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించాడనేది అతనిపై ప్రధాన ఆరోపణ. ఇదే ఆరోపణలపై అతడు దేశం విడిచి వెళ్లరాదంటూ మూడు వారాల క్రితమే కోర్టు ఆదేశించింది. సెపె్టంబర్ 15 వరకు సేనానాయకే పోలీసులలో అదుపులో ఉంటాడు.
అతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు కానుంది. 38 ఏళ్ల సేనానాయకే ఆఫ్ స్పిన్నర్‌గా 2012–2016 మధ్య శ్రీలంకకు ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి మొత్తం 78 వికెట్లు పడగొట్టాడు. 2014లో టి20 వరల్డ్ కప్ నెగ్గిన లంక జట్టులో అతను సభ్యుడు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు.