
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ (Stuart MacGill)ను కొకైన్ కేసులో సిడ్నీ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. 2021, ఏప్రిల్‌లో 3.3లక్షల ఆసీస్ డాలర్లు (రూ.1.80 కోట్లు) విలువ గల కేజీ కొకైన్ డ్రగ్ క్రయవిక్రయ ఒప్పందంలో నేరుగా పాల్గొనలేదని ధ్రువీకరించిన కోర్టు.. ఆ డ్రగ్ పంపిణీ మొత్తం వ్యవహారంలో అతనికి తెలియకుండానే క్రికెటర్‌కు భాగముందని దోషిగా తేల్చింది.
దీనిపై తుది శిక్షను ఎనిమిది వారాల్లో ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కేసు వివరాల్లోకి వెళితే... 2021లో మెక్‌గిల్‌కు చెందిన రెస్టారెంట్‌లో ఓ డ్రగ్ డీలర్‌కు, మెక్‌గిల్ బావమరిది మారినో సాటిరోపౌలొస్‌కు మధ్య కొకైన్ డ్రగ్ డీల్ జరిగింది.
ఇది చట్టవ్యతిరేక డ్రగ్ వ్యవహారమని తెలియక ఆ ఒప్పందంలో తలదూర్చానని మాజీ స్పిన్నర్ తన వాదన వినిపించాడు. పలు సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరుగా అతని ప్రమేయం లేదని ధ్రువీకరించింది.
అదే సమయంలో తెలిసి చేసినా, తెలియక చేసినా నేరం నేరమేనని ఇందులో శిక్ష అనుభవించక తప్పదని తీర్పు ఇచ్చింది. 54 ఏళ్ల మాజీ లెగ్‌స్పిన్నర్ ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టులు ఆడి 208 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి:
లక్నోకు ఆడనున్న ఆసీస్ ఆల్‌రౌండర్
గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం బరిలోకి దిగనున్నాడు. శ్రీలంక పర్యటనకు ముందు వెన్ను నొప్పితో ఆసీస్ జాతీయ జట్టుకు దూరమైన మార్ష్ ... ఐపీఎల్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే అందుబాటులో ఉండనున్నాడు.
గాయం పూర్తిగా మానక పోవడంతో మార్ష్ బౌలింగ్ చేయబోవడం లేదు. పేలవ ఆటతీరుతో టీమిండియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ ఆఖరి టెస్టుకు దూరమైన మార్ష్ ... చివరగా ఈ ఏడాది జనవరి 7న బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు.
ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో 33 ఏళ్ల మార్ష్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత మూడు సీజన్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మార్ష్‌ను గతేడాది వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసుకుంది.
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ లక్నో జట్టు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... ఈ నెల 18 వరకు మార్‡్ష జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మార్ష్ గతంలో... సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, పుణే వారియర్స్, డెక్కన్ చార్జర్స్ జట్ల తరఫున ఐపీఎల్ ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment