WTC Final: అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో తొలి సెంచరీలు ఎవరు చేశారు..?

First To Score A Century In ICC Events Finals - Sakshi

నిన్న (జూన్‌ 7) ప్రారంభమైన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా ట్రవిస్‌ హెడ్‌ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ ఆసీస్‌ ఆటగాడు డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా హెడ్‌ రికార్డుల్లోకెక్కిన అనంతరం వివిధ ఫార్మాట్ల ఐసీసీ ఈవెంట్స్‌ ఫైనల్స్‌లో ఎవరు శతక్కొట్టారనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. 

వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీల ఫైనల్స్‌లో ఎవరు తొలి సెంచరీ చేశారని ఆరా తీయగా.. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో తొలి సెంచరీ క్లైవ్‌ లాయిడ్‌ (1975 వరల్డ్‌కప్‌, వెస్టిండీస్‌), ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో తొలి సెంచరీ ఫిలో వాలెస్‌ (1998, వెస్టిండీస్‌) పేరిట నమోదై ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో జరిగే ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఇప్పటివరకు ఎవరూ సెంచరీ సాధించలేదు. టీ20 వరల్డ్‌కప్‌లో 11 సెంచరీలు నమోదైనప్పటికీ అన్నీ వివిధ దశల్లో వచ్చినవే. 

ఇదిలా ఉంటే, ఓవల్‌ వేదికగా నిన్న మొదలైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. ట్రావిస్‌ హెడ్‌ (146 నాటౌట్‌), స్టీవ్‌ స్మిత్‌ (95 నాటౌట్‌) సత్తా చాటడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. వార్నర్‌ (43), ఉస్మాన్‌ ఖ్వాజా (0), మార్నస్‌ లబూషేన్‌ (26) ఔటయ్యారు. షమీ, సిరాజ్‌, శార్దూల్‌కు తలో వికెట్‌ దక్కింది.

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపెవరిది..? ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (AI)ను ఆశ్రయించిన ఆసీస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top