తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు భారీ షాక్‌.. | Fakhar Zaman walk off the field in the first over vs New Zealand in Champions Trophy opener | Sakshi
Sakshi News home page

Champions Trophy: తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు భారీ షాక్‌..

Feb 19 2025 3:36 PM | Updated on Feb 19 2025 4:25 PM

Fakhar Zaman walk off the field in the first over vs New Zealand in Champions Trophy opener

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(Champions Trophy)కి బుధ‌వారం(ఫిబ్ర‌వ‌రి 19) తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

గాయం కార‌ణంగా ట్రైసిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగిన స్టార్ పేస‌ర్ హ్యారిస్ ర‌వూఫ్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే అదే సిరీస్‌లో గాయపడిన కివీస్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర మాత్రం ఇంకా కోలుకోలేదు. అతడు ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు.

ఇక తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ ఫఖర్ జమాన్ గాయ‌ప‌డ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ ఓవ‌ర్ వేసిన షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడో బంతికి విల్ యంగ్ క‌వ‌ర్స్ దిశ‌గా షాట్ ఆడాడు. ఆ బంతిని ఆపేందుకు జ‌మాన్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు. 

ఈ క్ర‌మంలో అత‌డి కూడి కాలికి గాయ‌మైంది. దీంతో అత‌డు నొప్పితో విల్లవిల్లాడు. వెంట‌నే అత‌డు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. అత‌డి స్దానంలో క‌మ్రాన్ గులాం స‌బ్‌స్ట్యూట్‌గా మైదానంలోకి వ‌చ్చాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌మాన్ తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌లేదు

కాగా అతడి గాయంపై పీసీబీ తాజాగా అప్‌డేట్‌ ఇచ్చింది. "ఫఖర్ జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని" పీసీబీ ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఒక‌వేళ అత‌డి గాయం తీవ్ర‌మైన‌ది అయితే పాకిస్తాన్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్ప‌టికే స్టార్ ఓపెన‌ర్ సైమ్ అయూబ్ సేవ‌ల‌ను పాక్ కోల్పోయింది.

తుదిజట్లు
పాకిస్తాన్‌
ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ
చదవండి: శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement