ధోని పట్టిందల్లా బంగారమే!

Everything He Touches Turns to Gold and That's Why He Named MSD - Sakshi

నాలుగు సార్లు చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజ‌న్‌(IPL 2023) ఫైన‌ల్లో అడుగుపెట్టింది. సీఎస్‌కే ప‌దోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిల‌వ‌డం ప‌ట్ల ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు సురేశ్ రైనా సంతోషం వ్య‌క్తం చేశాడు. టోర్నీ ఆసాంతం చెన్నైని అద్భుతంగా నడిపించిన మిస్ట‌ర్ కూల్ కెప్టెన్ ఎంఎస్‌ ధోని(MS Dhoni)ని అత‌ను ఆకాశానికెత్తేశాడు. జడేజా, దీప‌క్ చాహ‌ర్ త‌ప్పించి జ‌ట్టులో స్టార్ బౌల‌ర్లు లేక‌పోయినా సీఎస్‌కేను ఫైన‌ల్‌కు చేర్చిన మ‌హీపై ప్ర‌శంస‌లు కురిపించాడు.

ధోని ముట్ట‌కున్న ప్ర‌తీది బంగార‌మ‌వుతుంది. ధోని ప్ర‌తి విష‌యాన్ని చాలా సులువుగా మార్చుతాడు. యావ‌త్ భార‌త‌దేశం మొత్తం ధోని ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెల‌వాల‌ని కోరుకుంది’ అని రైనా వెల్ల‌డించాడు. ఏమంత అనుభ‌వం లేని మ‌హీశ్ థీక్ష‌ణ, మ‌తీశా ప‌తీరానా(శ్రీ‌లంక‌), తుషార్ దేశ్‌పాండే వంటి బౌల‌ర్ల‌పై న‌మ్మ‌కం ఉంచి, వాళ్ల‌ను మ్యాచ్ విన్న‌ర్లుగా మార్చాడు. తెలివైన వ్యూహాల‌తో, స‌రైన స‌మ‌యంలో బౌలింగ్ మార్పుల‌తో ధోనీ ఫ‌లితాలు రాబ‌ట్టాడు.

గ‌త సీజ‌న్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌తో 9వ స్థానంలో నిలిచిన ధోనీ సేన ఈసారి రెండో స్థానం సాధించింది. ఒక్క ఏడాదిలో జ‌ట్టు కూర్పు, ఆట‌గాళ్ల ఆట తీరు మార‌డం వెన‌క ధోని త‌న మార్క్ చూపించాడు. అందుకు ఉదాహార‌ణ వీళ్లే.. కెరీర్ ఇక ముగిసింది అనుకున్న‌ అజింక్యా ర‌హానేకు ద‌న్నుగా నిలిచాడు.

యంగ్‌స్ట‌ర్‌ శివం దూబే సిక్స‌ర్ల దూబేగా మార‌డం వెన‌క ధోని ఉన్నాడు. జ‌ట్టులో స‌హృద‌య వాతావ‌ర‌ణం ఉండేలా చూసి, ఆట‌గాళ్ల శ‌క్తి సామ‌ర్థ్యాల‌పై న‌మ్మ‌కం ఉంచిన ధోని సీఎస్కేను ఛాంపియ‌న్గా త‌యారుచేశాడు. ఈ నేప‌థ్యంలోనే రైనా ధోని ఏదీ ముట్టుకున్నా అది బంగార‌మైతుందన్నాడు.

చదవండి: పాపం చివరకు వికెట్‌ కీపర్‌ బకరా అయ్యాడు!

ఒక ప్లేఆఫ్‌.. 84 డాట్‌ బాల్స్‌.. 42వేల మొక్కలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top