శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌.. జింబాబ్వే జట్టు ప్రకటన

Ervine Returns As Zimbabwe Name Squads For White Ball Tour Of Sri Lanka - Sakshi

జనవరి 6 నుంచి శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం​ జిం​బాబ్వే జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. వన్డే, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించిన జింబాబ్వే క్రికెట్‌ బోర్డు.. వన్డే సారధిగా క్రెయిగ్‌ ఎర్విన్‌ను, టీ20 కెప్టెన్‌గా సికందర్‌ రజాను ఎంపిక చేసింది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఎర్విన్‌.. తిరిగి జట్టులో చేరడంతో పాటు వన్డే జట్టు పగ్గాలు చేపట్టాడు. 

మరోవైపు ఈ సిరీస్‌ల కోసం శ్రీలంక సైతం ప్రిలిమినరీ జట్లను ప్రకటించింది. లంక జట్టు సైతం రెండు ఫార్మాట్లలో కెప్టెన్లను మార్చింది. వన్డే జట్టుకు కుశాల్‌ మెండిస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20 జట్టుకు హసరంగ సారధిగా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. జనవరి 6, 8, 11 తేదీల్లో వన్డేలు.. 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లకు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. 

జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్‌ (కెప్టెన్‌), ఫరాజ్ అక్రన్, ర్యాన్ బర్ల్, జాయ్‌లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, తకుద్జ్వనషే కైతానో, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, టాపివా ముఫుద్జా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్‌ ముజరబానీ, రిచర్డ్‌ నగరవ, సికందర్‌ రజా, మిల్టన్‌ షుంభ

జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రాజా (కెప్టెన్‌), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, క్రెయిగ్ ఎర్విన్, జాయిలార్డ్ గుంబీ, ల్యూక్ జాంగ్వే, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, కార్ల్‌ ముంబా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్‌ ముజరబానీ, ఐన్‌స్లీ ఎండిలోవు. రిచర్డ్‌ నగరవ, మిల్టన్‌ షుంభ

శ్రీలంక వన్డే ప్రిలిమినరీ స్క్వాడ్: కుశాల్ మెండిస్ (కెప్టెన్‌), చరిత్‌ అసలంక (వైస్‌ కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సాహన్ అరాచ్చిగే, నువనిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్‌, చమిక కరుణరత్నే, జనిత్‌ లియనాగే, వనిందు హసరంగ, మషీశ్‌ తీక్షణ, దిల్షాన్ మదుషంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్, అషిత ఫెర్నాండో, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమికా గుణశేఖర

శ్రీలంక టీ20 ప్రిలిమినరీ స్క్వాడ్: వనిందు హసరంగ (కెప్టెన్‌), చరిత్ అసలంక (వైస్‌ కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, కుశాల్ మెండిస్, సధీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, మహీశ తీక్షణ, కుశాల్‌ జనిత్‌ పెరీరా, భానుక రాజపక్ష, కమిందు మెండిస్‌, దునిత్‌ వెల్లలగే, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, దిల్షన్‌ మధుషంక, బినుర ఫెర్నాండో, నుదాన్‌ తుషార, ప్రమోద్‌ మధుషన్‌, మతీష పతిరణ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top