ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోయిన్ అలీ.. మోర్గాన్ దూరం | Eoin Morgan ruled out from T20I series with quad injury | Sakshi
Sakshi News home page

ENG vs WI: ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోయిన్ అలీ.. మోర్గాన్ దూరం

Jan 28 2022 8:04 AM | Updated on Jan 28 2022 9:28 AM

Eoin Morgan ruled out from T20I series with quad injury - Sakshi

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌నలో ఉన్న ఇంగ్లండ్ జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. గాయం కార‌ణంగా ఆ జ‌ట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మిగితా రెండు టీ20ల నుంచి త‌ప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా  ధృవీకరించింది. "తొడ కండ‌రాల గాయం కార‌ణంగా మిగిలిన సిరీస్‌కు మోర్గాన్ దూరం కానున్నాడు" అని  ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇక మోర్గాన్ దూరం కావ‌డంతో మోయిన్ అలీ జట్టుకు సార‌థ్యం వ‌హించ‌నున్నాడు.

అదే విధంగా మూడో టీ20 మ్యాచ్‌కు కూడా మోర్గాన్ దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్ధానంలో అలీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వర్తించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర ప‌ర‌జాయం చెందిన ఇంగ్లండ్‌.. రెండో టీ20లో అనూహ్యంగా 1 ప‌రుగు తేడాతో విజ‌యం సాధించింది. ఇక మూడో టీ20లో ఇంగ్లండ్ ఓటమి చెందింది. క‌గా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మోర్గాన్ అంత‌గా రాణించ‌లేక‌పోయాడు. కేవ‌లం 30 ప‌రుగులు మాత్రమే సాధించాడు.

చ‌ద‌వండి: తెర మీదే అయినా... తగ్గేదే లే!

Advertisement
 
Advertisement
Advertisement