టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌..! ఇంగ్లండ్‌ జట్టులోకి స్పీడ్‌ గన్‌ ఎంట్రీ? | England Take Massive Call On Jofra Archer Before 2nd T20I vs India | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌..! ఇంగ్లండ్‌ జట్టులోకి స్పీడ్‌ గన్‌ ఎంట్రీ?

Jul 3 2026 5:18 PM | Updated on Jul 3 2026 5:22 PM

England Take Massive Call On Jofra Archer Before 2nd T20I vs India

మాంచెస్టర్ వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి టీ20 వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు శ్రేయ‌స్ అయ్య‌ర్ సేన‌కు ఓ బ్యాడ్ న్యూస్‌. 

తొలి టీ20కు దూరంగా ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చ‌ర్‌.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఆడనున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే జ‌ట్టుతో క‌లిసిన అత‌డు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో అవిరామంగా బౌలింగ్ చేయడంతో, ఆర్చర్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మొదటి టీ20 నుంచి తప్పించింది. 

అయితే మిగిలిన నాలుగు టీ20ల్లో జోఫ్రా ఆడనున్నాడు. శనివారం నాటి మ్యాచ్‌లో అతడు లూక్ వుడ్ లేదా లియామ్ డాసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్చర్ పునరాగమనం చేస్తే ఇంగ్లీష్ జట్టు బౌలిం‍గ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పవర్‌ప్లేలో ఈ రాజస్తాన్ స్పీడ్ స్టార్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. 

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టి తన శుభారంభాన్ని అందించేవాడు. కొత్త బంతితో అతడు అద్భుతాలు చేస్తాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఆర్చర్ దిట్ట. మరి భారత టాపార్డర్ బ్యాటర్లు ఆర్చర్‌ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత ఆర్చర్ ఆడుతున్న మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

భారత్‌తో రెండో టీ20కు ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా)
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement