T20 WC ENG Vs NZ: ఇంగ్లండ్‌ విజయాలను శాసిస్తున్న చివరి ఆరు ఓవర్లు 

England Bowling Last Six Overs 15-20 Crucial Winning Matches Australia - Sakshi

టి20 ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజృంభించింది. మొదట బ్యాటింగ్‌లో.. ఆపై బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై విజయం అందుకొని సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్‌కు చివరి ఆరు ఓవర్లు మాత్రం బాగా కలిసొస్తున్నాయి. ముఖ్యంగా చేజింగ్‌లో చివరి ఆరు ఓవర్లలో ఇంగ్లండ్‌ బౌలర్లు కింగ్స్‌ అనిపించుకుంటున్నారు.

డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ బాగా వేయడమనేది సవాల్‌తో కూడుకున్నది. పరుగులు కట్టడం చేయడమే ఎక్కువ అనుకుంటే ఇంగ్లండ్‌ బౌలర్లు మాత్రం వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఆసీస్‌ గడ్డపై చూసుకుంటే  గత ఐదు మ్యాచ్‌ల్లో చివరి ఆరు (15-20) ఓవర్లలో ఇంగ్లండ్‌ బౌలర్లు ఏకంగా 26 వికెట్లు తీశారు.

ఇందులో ఆస్ట్రేలియాపై పెర్త్‌ వేదికగా 48 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు, కాన్‌బెర్రా వేదికగా ఆసీస్‌పైనే 56 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు, ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌పై పెర్త్‌ వేదికగా 30 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు, మెల్‌బోర్న్‌ వేదికగా ఐర్లాండ్‌పై 41 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు, బ్రిస్బేన్‌ వేదికగా న్యూజిలాండ్‌పై 45 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసింది. చేజింగ్‌లో ఇంగ్లండ్‌ చివరి ఆరు ఓవర్లలో వికెట్లు తీసిన ప్రతీసారి విజయాలు అందుకోవడం విశేషం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే బట్లర్‌ సేన కివీస్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (40), గ్లెన్‌ ఫిలిప్స్‌ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలం కావడం కివీస్‌ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది.

చదవండి: అంచనాలు తలకిందులైన వేళ..

ఇంగ్లండ్‌ సెమీస్‌ ఆశలు సజీవం.. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో కివీస్‌పై విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top