T20 WC 2022 ENG Vs NZ: అంచనాలు తలకిందులైన వేళ..

Analyst Says Chris Woakes Bad option Vs-Devon Conway But Dismiss Later  - Sakshi

క్రికెట్‌లో విశ్లేషణ ఈరోజుల్లో కామన్‌గా మారిపోయింది. మ్యాచ్‌కు ముందు ఎవరు జట్టులో ఉంటే బాగుంటుంది.. బౌలింగ్‌, బ్యాటింగ్‌ కాంబినేషన్‌ ఏంటి.. జట్టు కూర్పు ఎలా ఉండాలి.. తొలుత బ్యాటింగ్‌ చేస్తే మంచిదా లేక బౌలింగ్‌ చేయాలా​అనే దానిపై క్రీడా పండితులు ఎవరికి తోచినట్లుగా వారు విశ్లేషిస్తారు. మ్యాచ్‌ పూర్తైన తర్వాత కూడా వీరి విశ్లేషణలు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లు చెప్పిన విషయాలు నిజమవ్వొచ్చు.. మరికొన్నిసార్లు విఫలం కావొచ్చు. ఇక మ్యాచ్‌ సమయంలో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌కు ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లలో ఎవరు బౌలింగ్‌ బాగా వేయగలరు అనేది అనలిస్టులు ఊహించడం చూస్తుంటాం. 

తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఒక అనలిస్ట్‌ చేసిన విశ్లేషణ పూర్తిగా రివర్స్‌ అయింది. అదేంటంటే.. కివీస్‌ బ్యాటర్లలో డెవన్‌ కాన్వే మంచి ఫామ్‌ కనబరుస్తున్నాడు. అతనికి బౌలింగ్‌లో ఎవరు గుడ్‌ ఆప్షన్‌ .. బ్యాడ్‌ ఆప్షన్‌ అనే విషయంపై ఒక క్రీడా అనలిస్టు స్పందించాడు. గుడ్‌ ఆప్షన్‌ కింద మొయిన్‌ అలీ, మార్క్‌ వుడ్‌లను ఎంచుకున్న సదరు అనలిస్ట్‌ బ్యాడ్‌ ఆప్షన్‌ కింద క్రిస్‌ వోక్స్‌ను ఎంచుకున్నాడు. 

ఇక్కడే అంచనాలు పూర్తిగా రివర్స్‌ అయ్యాయి. ఏ బౌలర్‌ అయితే కాన్వేకు బ్యాడ్‌ ఆప్షన్‌ అన్నాడో అతనో వికెట్‌ తీయడం విశేషం. వోక్స్‌ తాను వేసిన తొలి ఓవర్లోనే చివరి బంతికి కాన్వేను ఔట్‌ చేశాడు. వోక్స్‌ వేసిన బంతి బ్యాట్‌ను తాకి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకోగా కీపర్‌ బట్లర్‌ సూపర్‌గా డైవ్‌ చేసి స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో మూడు పరుగుల వద్ద కాన్వేను వెనక్కి పంపిన వోక్స్‌ ఇంగ్లండ్‌కు బ్రేక్‌ అందించాడు.

ఇది చూసిన అభిమానులు.. అంచనాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. మనం అనుకున్నవన్నీ రివర్స్‌ అవడం అంటే ఇదే. బ్యాడ్‌ ఆప్షన్‌ అని ఎంచుకున్న వోక్స్‌ ఇవాళ కాన్వే వికెట్‌ తీశాడు. మీ అంచనాలు తప్పాయి అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: కేన్‌ మామ ఇలా చేస్తావని ఊహించలేదు..

ఇంగ్లండ్‌ తరపున తొలి బ్యాటర్‌గా జాస్‌ బట్లర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2022
Nov 17, 2022, 15:28 IST
శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలకకు కాస్త ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుణతిలకకు బెయిల్‌ మంజూరు...
16-11-2022
Nov 16, 2022, 15:50 IST
ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌ అలెక్స్‌ హేల్స్‌ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా బ్యాటింగ్‌...
14-11-2022
Nov 14, 2022, 13:50 IST
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ రన్నరప్‌గానే మిగిలిపోయింది. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌ రెండోసారి పొట్టి ఫార్మాట్‌లో చాంపియన్‌గా...
14-11-2022
Nov 14, 2022, 13:36 IST
T20 World Cup: 2012 Winner West Indies- 2022 Winner England: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఈసారి ‘టై’ కాలేదు......
14-11-2022
Nov 14, 2022, 13:15 IST
టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా కోహ్లి మరో రికార్డు బద్దలు...
14-11-2022
Nov 14, 2022, 12:50 IST
మైదానంలో ప్రేక్షకులంతా మాకు మద్దతు పలికేందుకే వచ్చినట్లుందన్న బాబర్‌ ఆజం
14-11-2022
Nov 14, 2022, 12:24 IST
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ రన్నరప్‌గానే మిగిలిపోయింది. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌ రెండోసారి పొట్టి ఫార్మాట్‌లో చాంపియన్‌గా...
14-11-2022
Nov 14, 2022, 11:24 IST
టి20 ప్రపంచకప్‌ 2022లో ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల...
14-11-2022
Nov 14, 2022, 08:44 IST
టి20 ప్రపంచకప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌ రెండోసారి...
14-11-2022
Nov 14, 2022, 08:09 IST
అది 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 155...
14-11-2022
Nov 14, 2022, 07:42 IST
‘లెట్‌ ఇట్‌ హర్ట్‌...’ ఐర్లాండ్‌ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత తన సహచరులకు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఇ ఏకవాక్య సందేశం...
13-11-2022
Nov 13, 2022, 21:48 IST
టీ20 ప్రపంచకప్‌-2022 ఛాంపియన్స్‌గా ఇంగ్లండ్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విశ్వవిజేతగా ఇంగ్లండ్‌ అవతరించడంలో ఆ జట్టు ఆల్‌రౌండర్‌...
13-11-2022
Nov 13, 2022, 20:47 IST
టీ20 ప్రపంచకప్‌-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 చాంపియన్‌షిప్‌ను...
13-11-2022
Nov 13, 2022, 20:11 IST
మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచకప్‌-2022 విజేతగా నిలిచింది. అయితే ఫైనల్లో పాక్‌ ఓటమిని...
13-11-2022
Nov 13, 2022, 18:56 IST
టీ20 ప్రపంచకప్‌-2022 ట్రోఫీని ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం...
13-11-2022
Nov 13, 2022, 18:07 IST
కోహ్లి వరస్ట్‌ కూడా నీ బెస్ట్‌ కాదు! సెంటిమెంట్లు నమ్ముకుంటే పనికాదు బాబర్‌!
13-11-2022
Nov 13, 2022, 18:01 IST
టీ20 ప్రపంచకప్‌-2022 ఛాంపియన్స్‌గా ఇంగ్లండ్‌ నిలిచింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌ రెండోసారి టీ20 ప్రపంచకప్‌...
13-11-2022
Nov 13, 2022, 17:46 IST
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England Updates In Telugu: ఐదు వికెట్ల...
13-11-2022
Nov 13, 2022, 17:07 IST
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England: పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ మరోసారి...
13-11-2022
Nov 13, 2022, 17:01 IST
అంతర్జాతీయ టీ20ల్లో  పాకిస్తాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అ‍త్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్‌... 

Read also in:
Back to Top