T20 WC 2022: Fans Reaction On Kane Williamson Drops Joss Buttler Catch, Video Viral - Sakshi
Sakshi News home page

Kane Williamson: కేన్‌ మామ ఇలా చేస్తావని ఊహించలేదు..

Nov 1 2022 3:30 PM | Updated on Nov 1 2022 5:46 PM

Fans Reaction After Kane Williamson Drops Joss Buttler Catch Viral - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్‌ జట్టు అంటేనే మంచికి మారుపేరు. క్రికెట్‌లో వివాదాలకు దూరంగా ఉండే జట్టు కివీస్‌. అందునా మంచి కెప్టెన్‌గా పేరు పొందిన కేన్‌ విలియమ్సన్‌ ఒక క్యాచ్‌ విషయంలో తొలిసారి చీటింగ్‌ చేయడం ఆసక్తి కలిగించింది. ఇది సగటు క్రికెట్‌ అభిమానిని ఆశ్చర్యపరిచింది.

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ మిచెల్‌ సాంట్నర్‌ వేశాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని బట్లర్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అద్బుతంగా డైవ్‌ చేసి క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో వారెవ్వా ఏం క్యాచ్‌ పట్టాడురా అనుకోకుండా ఉండలేం. అందుకు తగ్గట్లే విలియమ్సన్‌ కూడా క్యాచ్‌ అందుకున్నట్లు ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. 

జాస్‌ బట్లర్‌ కూడా విలియమ్సన్‌ పట్టిన క్యాచ్‌కు షాక్‌ అయి పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. విలియమ్సన్‌ అందుకున్న క్యాచ్‌పై అంపైర్లకు అనుమానం వచ్చింది. దీంతో రిప్లేలో చూడగా.. విలియమ్సన్‌ బంతిని అందుకున్నప్పటికి మొదట గ్రౌండ్‌ తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో బట్లర్‌ నాటౌట్‌ అని అంపైర్లు ప్రకటించారు. మొత్తానికి మంచికి మారు పేరైన కేన్‌ మామ ఇలా చేస్తాడని ఊహించలేదు అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఆ తర్వాత బట్లర్‌ దగ్గరికొచ్చిన విలియమ్సన్‌ తన చర్యకు క్షమాపణ కోరాడు.

చదవండి: గెలుస్తే నిలుస్తారు.. న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనున్న ఇంగ్లండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement