
ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా ఓ రికార్డును తిరగరాసింది. ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగుల విభాగంలో భారత్ తమ పూర్వపు రికార్డును బద్దలు కొట్టింది. 1978-79 వెస్టిండీస్ సిరీస్‌లో భారత్ ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 3270 పరుగులు చేసింది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు ఓ సిరీస్‌లో భారత జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే.
ప్రస్తుత సిరీస్‌తో టీమిండియా తమ పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పాత రికార్డును చెరిపేసింది. తొలి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ స్కోర్‌తో ఈ సిరీస్‌లో భారత్ పరుగుల సంఖ్య 3393 పరుగులకు చేరింది.
ఈ సిరీస్ మొత్తంలో భారత్ చేసిన ఈ పరుగులు 1995 నుంచి ఓ సిరీస్‌లో ఓ జట్టుచే చేయబడిన అత్యధిక పరుగులు కూడా కావడం మరో విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే.. 204/6 స్కోర్ వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్‌కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యారు.
ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్‌ను టంగ్ బోల్తా కొట్టించాడు.
ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్‌కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43) ఔట్ కాగా.. ఓలీ పోప్ (18), జో రూట్ (4) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే.