
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తమ జోరును కొనసాగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో గిల్ సేన తమ మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), ధ్రువ్ జురెల్(125), రవీంద్ర జడేజా(104 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. 121/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రాహుల్, గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్.. ధ్రువ్ జురెల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.
రాహుల్ తన సెంచరీ పూర్తి చేసిన వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజాలు విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ క్రీజులోకి పాతుకుపోయి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. రిషబ్ పంత్ స్దానంలో జట్టులోకి వచ్చిన తన లభించిన అవకాశాన్ని సద్వినియోపరుచుకున్నాడు.
190 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 210 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125 పరుగులు చేశాడు. అయిదో వికెట్‌కు జడేజాతో కలిసి 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జురెల్ ఔటయ్యాక జడేజా సైతం తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా పాటు వాషింగ్టన్ సుందర్(9) ఉన్నారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు, సీల్స్, వారికన్, ఖరీ పియర్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs AUS: ఆసీస్‌పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్