Devon Conway: కాన్వే జోరు వెనుక ప్రధాన సూత్రధారి ఎవరంటే?

Devon Conway Says MS Dhoni Advice Helps-Me Unstopable Batting - Sakshi

డెవన్‌ కాన్వే.. సీజన్‌ ఆరంభంలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. ఏప్రిల్‌ మొదటి వారంలో వ్యక్తిగత కారణాల రిత్యా లీగ్‌ విడిచి బయటకు వెళ్లాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకొని మళ్లీ ఏప్రిల్‌ చివరి వారంలో జట్టుతో కలిశాడు. అయితే కాన్వేకు తుదిజట్టులో అవకాశం మాత్రం రాలేదు. సీజన్‌లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

కెప్టెన్‌గా దారుణంగా విఫలమైన జడేజా నాయకత్వ బాధ్యతలను ధోనికి అప్పగించాడు. ఇక్కడి నుంచి సీన్‌ కాస్త రివర్స్‌ అయింది. తన మైండ్‌గేమ్‌తో కాన్వేకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. అంతే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కాన్వే అర్థసెంచరీలతో మెరిశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 85 నాటౌట్‌, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 56, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 87 పరుగులు సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్థసెంచరీ చేసిన మూడో సీఎస్‌కే బ్యాట్స్‌మన్‌గా కాన్వే నిలిచాడు. ప్రస్తుతం సీఎస్‌కే 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. 

తాజాగా కాన్వే తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ''సీఎస్కే కెప్టెన్‌ ధోని ఇచ్చిన సలహా బాగా ఉపయోగపడిందని తెలిపాడు. ఢిల్లీతో మ్యాచ్‌ అనంతరం కాన్వే మాట్లాడాడు. గత రెండు మ్యాచ్‌ల్లో రుతురాజ్‌తో మంచి సమన్వయం ఏర్పడింది. మా ఆలోచనను సింపుల్‌గా ఆచరణలో పెట్టాం. రుతురాజ్‌, నేను కలిసి మొదట ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించి ఆ తర్వాత వేగం పెంచాలని భావించాం. అందుకు తగ్గట్లే మా ప్రణాళికలు రచించాం. కెప్టెన్‌ ధోని, నేను, రుతురాజ్‌, హస్సీ.. ఈ విషయమై చాలాసేపు చర్చించుకున్నాం.

గత మూడు మ్యాచ్‌ల్లో సక్సెస్‌ అవడం వెనుక మా కెప్టెన్‌ ధోని సలహా బాగా ఉపయోగపడింది. గత మ్యాచ్‌లో స్పిన్‌ బౌలింగ్‌లో స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔట్‌ అయ్యాను. దీంతో ధోని.. ''గేమ్‌పై ఫోకస్‌ ఉంచు.. రిస్కీ షాట్స్‌ వద్దు.. స్రెయిట్‌ షాట్స్‌ ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించు.. అదే నిన్ను నిలబెడుతుంది. ధోని చెప్పినట్లే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎలాంటి పొరపాటు చేయకుండా బ్యాటింగ్‌ ఆడాను. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని 17 పరుగులు సాధించాను. స్పిన్నర్ల బలహీనతను అధిగమించడంలో ధోని సహాయం చేశాడు. మా కెప్టెన్‌ ధోనికి థాంక్స్‌'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2022: ధోని.. బ్యాట్‌ కొరకడం వెనుక అసలు కథ ఇదే!

MS Dhoni: ధోని అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-06-2022
Jun 11, 2022, 17:34 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన...
08-06-2022
Jun 08, 2022, 15:46 IST
India Vs South Africa 2022 T20 Series: టీమిండియాలో చోటు దక్కడం పట్ల కశ్మీర్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌...
05-06-2022
Jun 05, 2022, 08:42 IST
అర్జున్‌ టెండూల్కర్‌.. భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప...
05-06-2022
Jun 05, 2022, 07:57 IST
ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో తనకు శాపం తగిలిందని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఏదో కారణంగా...
04-06-2022
Jun 04, 2022, 12:11 IST
తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్‌ గిల్‌ అన్న యశ్‌ దయాల్‌
03-06-2022
Jun 03, 2022, 21:16 IST
అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్...
03-06-2022
Jun 03, 2022, 20:12 IST
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ గత రెండేళ్లుగా ఐపీఎల్‌ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్‌-2021 మినీ వేలంలో...
03-06-2022
Jun 03, 2022, 19:10 IST
ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. మరోసారి లీగ్‌ దశలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్‌లో...
03-06-2022
Jun 03, 2022, 18:19 IST
భారత జట్టు నుంచి నన్ను ఎవరూ తప్పించలేదు.. అసలు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటేనే కదా!
03-06-2022
Jun 03, 2022, 16:38 IST
IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడలేదు.. అయినా కోటికి పైగా వెనకేశారు! టైటిల్స్‌ కూడా!
03-06-2022
Jun 03, 2022, 14:12 IST
ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్...
02-06-2022
Jun 02, 2022, 16:52 IST
నెహ్రాపై కిర్‌స్టన్‌ ప్రశంసల జల్లు
02-06-2022
Jun 02, 2022, 10:38 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర...
01-06-2022
Jun 01, 2022, 16:40 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఏ మాత్రం...
01-06-2022
Jun 01, 2022, 11:24 IST
IPL 2022: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల...
31-05-2022
May 31, 2022, 17:18 IST
ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ బంతిని గంటకు 150...
31-05-2022
May 31, 2022, 16:36 IST
ఐపీఎల్‌‌ 15వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జాస్‌ బట్లర్‌ నిలిచాడు.17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా...
31-05-2022
May 31, 2022, 13:05 IST
టీమిండియా స్పిన్నర్‌ కరణ్‌ శర్మకు ఐపీఎల్‌లో అత్యంత అదృష్టవంతమైన ఆటగాడిగా పేరుంది. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే టైటిల్‌...
31-05-2022
May 31, 2022, 10:48 IST
ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఛాంపియన్స్‌గా హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ సాధించి...
31-05-2022
May 31, 2022, 08:37 IST
ఐపీఎల్‌-2022లో భాగమైన  పిచ్‌ క్యూరేటర్‌లు,గ్రౌండ్స్‌మెన్‌లకు బీసీసీఐ  భారీ నజరానా ప్రకటిచింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన ఆరు వేదికలలో పనిచేసిన...



 

Read also in:
Back to Top