IPL 2022: MS Dhoni Becomes 1st Batsman With Most Runs Scored In Death Overs In IPL History - Sakshi
Sakshi News home page

MS Dhoni: ధోని అరుదైన ఫీట్‌.. ఐపీఎల్‌ చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు

May 9 2022 9:18 AM | Updated on May 9 2022 10:55 AM

IPL 2022: MS Dhoni Was 1st Batsman Highest Runs Death Overs IPL History - Sakshi

PC: IPL Twitter

ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఫీట్‌ సాధించాడు. మ్యాచ్‌లో సీఎస్‌కే 200 పరుగుల మార్క్‌ను దాటడంలో ధోని కీలకపాత్ర వహించాడు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌ ఉన్నాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా ఆఖర్లోనే బ్యాటింగ్‌కు వస్తున్న ధోని ఫినిషర్‌గా అదరగొడుతున్నాడు.

ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన ధోనీ.. ఆ తర్వాత కూడా తక్కువ స్కోర్లే చేసినప్పటికి మెరుపు ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే ధోని ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా డెత్ ఓవర్లలో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత మరెవరికీ సాధ్యం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికి తనలో ఫినిషర్‌ ఇంకా బతికే ఉన్నాడని ధోని రుజువు చేశాడు.

కాగా ఇదే మ్యాచ్ ద్వారా ధోనీ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. టీ20ల్లో కెప్టెన్‌గా ఆరువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఫీట్‌ సాధించాడు. ఓవరాల్‌గా టి20 కెప్టెన్‌గా ధోని 186 ఇన్నింగ్స్‌లో 6015 పరుగులు చేశాడు. ధోనీ కన్నా ముందు ఆర్‌సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఒక్కడే కెప్టెన్‌గా 6వేల పరుగులు సాధించాడు. 

చదవండి: IPL 2022: భళా సీఎస్‌కే.. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగో అతిపెద్ద విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement