Pro Kabaddi League 2021: Dabang Delhi beat U Mumba - Sakshi
Sakshi News home page

నవీన్‌ అదుర్స్‌ దబంగ్‌ ఢిల్లీకి రెండో విజయం

Dec 25 2021 5:38 AM | Updated on Dec 25 2021 8:04 AM

Dabang Delhi beats U Mumba - Sakshi

బెంగళూరు: దబంగ్‌ ఢిల్లీ జట్టు స్టార్‌ రెయిడర్‌ నవీన్‌ కుమార్‌ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్‌లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్‌ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను పట్టేసి మరో పాయింట్‌ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్‌ 500 రెయిడింగ్‌ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్‌ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్‌గా నవీన్‌ నిలిచాడు.

సహచరుడు జోగిందర్‌ సింగ్‌ నర్వాల్‌ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్‌ కుమార్‌ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌ 38–30తో తమిళ్‌ తలైవాస్‌పై, డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ 31–28తో గుజరాత్‌ జెయింట్స్‌ గెలిచాయి. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్‌; పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్‌; హరియాణా స్టీలర్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఆడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement