
కెరీర్‌లో 21వ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఇటలీ స్టార్
బీజింగ్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ తన కెరీర్‌లో 21వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. బుధవారం ముగిసిన చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ చాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచ 52వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 6–2, 6–2తో గెలుపొందాడు.
72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సినెర్ పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది సినెర్‌కిది మూడో టైటిల్. విజేతగా నిలిచిన సినెర్‌కు 7,51,075 డాలర్ల (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ లెర్నర్ ఖాతాలో 4,04,105 డాలర్ల (రూ. 3 కోట్ల 58 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 300 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి.