స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

ILT20 2024: స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్‌

Published Sun, Jan 21 2024 8:27 AM

Bollywood superstar Shahrukh Khan spotted in Dubai watching ILT20 game - Sakshi

ఇంటర్నేషనల్ లీగ్‌ టీ20-2024లో భాగంగా శనివారం దుబాయ్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్‌ ఖాన్‌ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చాడు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను షారుఖ్‌ ఎంజాయ్‌ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు.

షారుఖ్‌తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ  కిరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత ఏడాది  ఇంటర్నేషనల్  టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌ ప్రారంభ వేడుకలకు సైతం  షారుఖ్‌ హాజరయ్యాడు. ఈ లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్నాడు.

కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన  ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి స్టార్‌ ఆటగాళ్లు భాగమయ్యారు. కాగా  కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఫ్రాంచైజీ సహ యజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై ఎమిరేట్స్‌పై 7 వికెట్ల తేడాతో దుబాయ్‌ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్‌.. ఒకే ఒక్కడు

Advertisement
 
Advertisement
 
Advertisement