జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌ | Bihar Announces Squad For First Two Ranji Trophy Matches | Sakshi
Sakshi News home page

జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌

Oct 8 2026 10:13 AM | Updated on Oct 8 2026 10:13 AM

Bihar Announces Squad For First Two Ranji Trophy Matches

PC: BCCI/X

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఆడే తొలి రెండు మ్యాచ్‌ల కోసం బిహార్ క్రికెట్ అసోసియేషన్ 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. బీసీసీఐ నియమించిన పరిశీలకుల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా ఈ జట్టు ఎంపిక జరిగింది. అయితే ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం గమనార్హం.

 ప్రస్తుతం అతడు భారత సీనియర్ జట్టు తరపున జాతీయ విధుల్లో బిజీగా ఉండడం ఇందకు కారణం. గత సీజన్‌లో వైభవ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈసారి అతడు అందుబాటులో లేకపోవడంతో  ఆ బాధ్యతలను హిమాన్షు సింగ్‌కు అప్పగించారు. అదేవిధంగా మరోసారి బిహార్ జట్టును ముందుండి నడిపించేందుకు ఆల్‌రౌండర్ సకీబుల్ గని సిద్దమయ్యాడు.

రాజ్‌గిర్ స్టేడియంలో చారిత్రక మ్యాచ్
సకీబుల్ గని నేతృత్వంలోని బిహార్ జట్టు అక్టోబర్ 11న ఉత్తర ప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. కొత్తగా నిర్మించిన 'రాజ్‌గిర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం' వేదికగా జరగనున్న ఈ పోరు బిహార్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది. ఈ మైదానంలో జరుగుతున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇదే కావడం విశేషం.

బిహార్ రంజీ జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు):
సకీబుల్ గని (కెప్టెన్), హిమాన్షు సింగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ లోహరుకా, మంగళ్ మహ్రూర్, నమన్ గౌరవ్, పీయూష్ సింగ్, బిపిన్ కుమార్ సౌరభ్ (వికెట్ కీపర్), శర్మన్ నిగ్రోధ్ (వికెట్ కీపర్), ఆకాష్ రాజ్, పృథ్వీ రాజ్, ఖాలిద్ ఆలం, సూరజ్ కుమార్ కశ్యప్, షకీబ్ హుస్సేన్, ఎండి ఇజార్, షబ్బీర్ ఖాన్, రాఘవేంద్ర సింగ్, ఆమోద్ యాదవ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు:
నవాజ్ ఖాన్, మలయ్ రాయ్, దానిష్ ఆలం, తను కుమార్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, ప్రశాంత్ కుమార్ సింగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement