
వచ్చే ఐపీఎల్ సీజన్ (2026) కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. గడిచిన సీజన్‌లో ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో (14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు) నిలిచింది. ఈ కారణంగానే సీఎస్‌కే యాజమాన్యం భారీ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది.
ఈ క్రమంలో సీఎస్‌కే ఓ కీలక ఆటగాడిగాని జట్టులో చేర్చుకోవచ్చని తెలుస్తుంది. ఇంగ్లండ్ బజ్‌బాల్ టెక్నిక్‌లో భాగమైన బెన్ డకెట్‌పై సీఎస్‌కే కన్నేసినట్లు తెలుస్తుంది. డకెట్‌ను జట్టులో చేర్చకోవడం వల్ల సీఎస్‌కే అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
గత సీజన్‌లో సీఎస్‌కేకు సరైన ఓపెనింగ్ బ్యాటర్ లేక పవర్‌ప్లేల్లో తేలిపోయింది. ఆ జట్టుకు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుపు ఆరంభం లభించలేదు. సీఎస్‌కే గత సీజన్ మొత్తం ఓపెనర్లతో ప్రయోగాలు చేసింది. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే, షేక్ రషీద్, ఆయుశ్ మాత్రేతో రకరకాల కాంబినేషన్లతో ప్రయోగాలు చేసిన సత్ఫలితాలు రాలేదు.
డకెట్ ఆ జట్ట పవర్‌ప్లే కష్టాలకు సరైన పరిష్కారం కావచ్చు. డకెట్‌కు పవర్‌ప్లేల్లో మంచి రికార్డు ఉంది. దూకుడైన ఆటతీరుతో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లకు మెరుపు ఆరంభాలను అందించాడు. టీ20ల్లో డకెట్‌కు 140కు పైగా స్ట్రయిక్‌రేట్ ఉంది. పవర్‌ప్లేల్లోనే కాకుండా క్రీజ్‌లో కుదురుకుంటే ఇన్నింగ్స్ మొత్తం దడదడలాడించేస్తాడు డకెట్.
గత సీజన్‌లో సీఎస్‌కే ఎదుర్కొన్న మరో కీలకమైన సమస్య స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం. ఈ సమస్యకు కూడా డకెట్ సరైన పరిష్కారం కావచ్చు. డకెట్‌కు స్పిన్నర్లపైన మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడికున్న అద్బుతమైన టెక్నిక్‌తో స్పిన్నర్లకు ఎడాపెడా వాయించేస్తాడు.
స్పిన్నర్లపై అతని స్వీప్ షాట్లు, ముఖ్యంగా రివర్స్ స్వీప్‌లు అమితంగా ఆకట్టుకుంటాయి. పై కారణాలకు పరిష్కారం దిశగా సీఎస్‌కే వచ్చే సీజన్ కోసం డకెట్‌ను తప్పక కొనుగోలు చేస్తుందని టాక్ నడుస్తుంది. ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోయే 30 ఏళ్ల డకెట్ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు తురుపుముక్కగా ఉన్నాడు.