Marco Jansen: 69 పరుగులకే 5 వికెట్లు! పట్టుదలగా నిలబడ్డ జాన్సెన్‌, వెయిర్నే.. కెరీర్‌లో తొలిసారి..

Aus Vs SA 2nd Test: Playing XI Marco Jansen Maiden Test Fifty - Sakshi

Australia vs South Africa, 2nd Test: వరుసగా రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికాతో ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు రోజుల్లోనే గెలిచింది. కాగా తొలి టెస్టులో ఆడిన జట్టునే ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో కొనసాగిస్తున్నామని ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌తో డేవిడ్‌ వార్నర్‌ ఆస్ట్రేలియా తరఫున 100వ టెస్టు ఆడనున్న 14వ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ 26 పరుగుల వద్ద రనౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ సారెల్‌ ఎర్వీ 18 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. థీనిస్ డి బ్రూయిన్(12), తెంబా బవుమా(1), ఖయా జోండో( 5)పూర్తిగా నిరాశపరిచారు.

అర్ధ శతకాలతో ఆ ఇద్దరు.. కెరీర్‌లో తొలిసారి
ఈ క్రమంలో 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి  కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను కైల్ వెరెయ్నే, మార్కో జాన్సెన్ తమ భుజాన వేసుకున్నారు.  జాన్సెన్‌ అర్ధ శతకతంతో మెరిశాడు. 118 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా టెస్టుల్లో జాన్సెన్‌కు ఇదే తొలి హాఫ్‌ సెంచరీ.

మరోవైపు.. లియోన్‌ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌ దిశగా షాట్‌ పరుగు పూర్తి చేసుకున్న వెయిర్నే సైతం హాఫ్‌ సెంచరీ(80 బంతుల్లో) సాధించాడు. ఈ సిరీస్‌లో, టెస్టుల్లో అతడికి ఇది రెండో టెస్టు అర్ధ శతకం కావడం విశేషం. 

ఇక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 పాయింట్ల పట్టికలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే సగర్వంగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అదే విధంగా రెండో స్థానం కోసం టీమిండియాతో పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా గనుక మెరుగ్గా ఆడితే.. రోహిత్‌ సేనకు కష్టాలు తప్పవు.

తుది జట్లు
ఆస్ట్రేలియా
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

దక్షిణాఫ్రికా
డీన్ ఎల్గర్(కెప్టెన్‌), సారెల్ ఎర్వీ, థీనిస్ డి బ్రూయిన్, టెంబా బావుమా, ఖయా జోండో, కైల్ వెరెయ్నే(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి.

చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు
IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్‌ రీ ఎంట్రీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top