Arjun Tendulkar Sets Internet On Fire With His Six Pack Abs Pic Viral - Sakshi
Sakshi News home page

అప్పట్లో శుబ్‌మన్‌.. ఇప్పుడు అర్జున్‌ టెండుల్కర్‌.. ఫొటో వైరల్‌

Published Thu, Jul 27 2023 1:12 PM

Arjun Tendulkar Sets Internet On Fire With His Six Pack Abs Pic Viral - Sakshi

Arjun Tendulkar Latest Six-Pack Abs Pic: టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో మిర్రర్‌ సెల్ఫీ తీసుకున్న అర్జున్‌.. దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ఫిట్‌నెస్‌కు అర్జున్‌ ఎంత ప్రాధాన్యం ఇస్తాడో అర్థమవుతోందంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ ఏడాది కల నెరవేరింది
కాగా దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూశాడు. ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్నా రెండేళ్లపాటు అర్జున్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ పదహారో ఎడిషన్‌ సందర్భంగా అతడి కల నెరవేరింది. తాజా సీజన్‌లో ముంబై తరఫున క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు.

తన తండ్రి మెంటార్‌గా ఉన్న జట్టుకే ప్రాతినిథ్యం వహించిన అర్జున్‌.. మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి 92 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక ప్రస్తుతం దియోదర్‌ ట్రోఫీ-2023లో సౌత్‌ జోన్‌కు ఆడుతున్న అర్జున్‌.. తాజా సెల్ఫీతో నెట్టింట సందడి చేస్తున్నాడు.

అప్పట్లో శుబ్‌మన్‌.. ఇప్పుడు అర్జున్‌
కాగా ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎప్పటికపుడు జిమ్‌లో చెమటోడుస్తూ.. సరైన జీవనశైలిని పాటిస్తేనే ఆరోగ్యంతో పాటు కెరీర్‌ను పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఇక టీమిండియా క్రికెటర్లలో ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన విరాట్‌ కోహ్లి కూడా గతంలో తన సిక్స్‌ పాక్‌ ఆబ్స్‌ ఫొటోను పంచుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌, టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణంగా మారిన శుబ్‌మన్‌ గిల్‌ కూడా అదే బాటలో నడిచారు. ఇప్పుడు అర్జున్‌ టెండుల్కర్‌ సైతం వారిని అనుసరిస్తూ తన ఫొటోను షేర్‌ చేశాడు. కాగా గోవా తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి అత్యధికంగా ఎనిమిది వికెట్లు తీసిన పేసర్‌గా అర్జున్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. 

దియెదర్‌ ట్రోఫీలో మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యంలో ఆడుతున్న అతడు.. కర్ణాటక బౌలర్‌ విద్వత్‌ కవెరప్ప, వైశాక్‌ విజయ్‌కుమార్‌, వి.కౌశిక్‌తో కలిసి పేస్‌ దళంలో భాగమయ్యాడు. 23 ఏళ్ల అర్జున్‌ టెండుల్కర్‌ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ ఉంటూ అప్‌డేట్లు అభిమానులతో షేర్‌ చేసుకుంటాడు. 

చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!

Advertisement
Advertisement