ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అనాహత్‌ సింగ్‌ | Anahat Singh in the pre quarter final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అనాహత్‌ సింగ్‌

Jul 15 2024 3:03 AM | Updated on Jul 15 2024 3:03 AM

Anahat Singh in the pre quarter final

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ బాలికల సింగిల్స్‌లో భారత రైజింగ్‌ స్టార్, జాతీయ చాంపియన్‌ అనాహత్‌ సింగ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మూడో రౌండ్‌లో అనాహత్‌ సింగ్‌ 11–7, 12–10, 11–6తో సమంతా జాఫీ (అమెరికా)పై గెలిచింది. 

బాలుర సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ శౌర్య బావా కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్‌లో శౌర్య 4–11, 11–7, 12–10, 11–6తో రస్టిన్‌ వైజర్‌ (అమెరికా)పై నెగ్గాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement