T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్‌

3 Middle Order Players Could Replace Suryakumar Ishan Kishan Indian Team - Sakshi

Replacement Of Surya Kumar And Ishan Kishan.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా డిపెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన కొనసాగిస్తుంది. సెకండ్‌ ఫేజ్‌ మొదలయ్యాకా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు రోహిత్‌ శర్మ, డికాక్‌లు శుభారంభం అందించినప్పటికి తర్వాతి బ్యాటర్స్‌ దారుణంగా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్ల దాటికి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. వీరికి తోడు హార్దిక్‌ పాండ్యా కూడా సరిగా మ్యాచ్‌లు ఆడడం లేదు.

చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యాచ్‌ ఫినిషర్‌.. జడేజాపై ప్రశంసల వర్షం

అయితే ఈ ముగ్గురు టి20 ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా జట్టులో చోటు సంపాదించారు. వీరి ఫామ్‌ ఇలాగే ఉంటే మాత్రం టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పుడిదే సెలక్షన్‌ ప్యానల్‌కు తలనొప్పిగా మారింది. చేతన్‌ శర్మ సారధ్యంలోని టీమిండియా సెలక్షన్‌ కమిటీకి సెప్టెంబర్‌ 10 వరకు జట్టును మార్చే అవకాశం ఉంది. దీనికి తోడు టీమిండియాకు ఎంపికైన జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆడుతున్నారు కాబట్టి వారు చేసే ప్రదర్శనను కీలకంగా భావిస్తున్నారు. ఒకవేళ జట్టును మార్చే అవకాశం ఉంటే మాత్రం శ్రేయాస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, మాయంక్‌ అగర్వాల్‌ పేర్లను పరిశీలిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురిలో అయ్యర్‌ స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఉండగా.. మిగతా ఇద్దరు జట్టుకు ఎంపిక కాలేదు. 

శ్రేయాస్‌ అయ్యర్‌:


గతేడాది ఐపీఎల్‌ 2020 సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత ప్రదర్శనతో​ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా జట్టులో చోటు సంపాదించిన అయ్యర్‌  గాయం కారణంగా అర్థంతరంగా ఐపీఎల్‌ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. అతని స్థానంలో రిషబ్‌ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపికచేయడం.. అతను తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం.. అతని సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ దుమ్మురేపడం జరిగిపోయాయి. అయితే కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడి.. మళ్లీ ప్రారంభమైంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన అయ్యర్‌ కెప్టెన్‌గా గాక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రెండో అంచె పోటీల్లో తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన అయ్యర్‌ సూపర్‌ ఫామ్‌ కంటిన్యూ చేస్తున్నాడు. అతను తుది జట్టులో ఉంటే మిడిలార్డర్‌ సమతూకంగా ఉండడంతో పాటు స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొగలడనే పేరుంది. కాగా శ్రేయాస్‌ అయ్యర్‌ టీమిండియా తరపున 29 టి20ల్లో 550 పరుగులు సాధించాడు.

చదవండి: Indw vs Ausw: తమ వన్డేల చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా

మయాంక్‌ అగర్వాల్‌: 


Courtesy: IPL Twitter
లేటు వయసులో మంచి ఫామ్‌తో అదరగొడుతున్నాడు. జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ విఫలమైనప్పటికీ.. ఆటగాడిగా తాను సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. కేఎల్‌ రాహుల్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యాలు నిర్మించిన మయాంక్‌ మిడిల్‌ ఆర్డర్‌లో కూడా రాణించే సత్తా ఉంది. 2020 ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌ల్లో 424 పరుగులు చేసిన మయాంక్‌ ఈ ఏడాది ఐపీఎల్‌(2021) సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఫామ్‌ దృశ్యా మయాంక్‌కు అవకాశమిస్తే రాణించే అవకాశం ఉంది. ఇక మయాంక్‌ టీమిండియా తరపున 14 టెస్టులు.. 5 వన్డేలు ఆడాడు.

సంజూ శాంసన్‌:


Courtesy: IPL Twitter
సహజంగా మంచి టెక్నిక్‌ ఉన్న బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌. క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్నవాడు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో అదరగొడుతున్న అతను అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం చతికిలపడ్డాడు. అయితే ప్రస్తుత ఫామ్‌ చూసుకుంటే మాత్రం టీమిండియా జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్‌లో న్యాయం చేయగలడనే నమ్మకం ఉంది. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో సంజూకు అవకాశమిస్తే వికెట్‌ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. ఇక సంజూ శాంసన్‌ టీమిండియా తరపున 1 వన్డే, 10 టి20లు ఆడాడు.

చదవండి: T20 World Cup: కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.. నేనైతే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top