ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యాచ్‌ ఫినిషర్‌.. జడేజాపై ప్రశంసల వర్షం

KKR VS CSK: Ravindra Jadeja Earns Praise From Former Cricketers AnD Experts - Sakshi

Ravindra Jadeja Earns Praise From Former Cricketers: ఐపీఎల్‌2021 ఫేజ్‌2లో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఖరి బంతికి  చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో  ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా  చెన్నైకు ఒంటి చేత్తో గెలుపునందించాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ సూపర్ పెర్ఫార్మెన్స్‌తో కోల్‌కతా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ క్రమంలో మాజీలు, క్రికెట్‌ నిపుణులు జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జడేజా  ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌ అంటూ భారత మాజీ ఆటగాడు బద్రీనాథ్ ట్విట్టర్‌లో అభినందించాడు. భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ కూడా జడేజాను ప్రశంసించాడు. 

"చెన్నై  అద్భుతమైన విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోను ఆదరగొట్టిన జడేజా..  చెన్నైను పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిపాడు" అని సెహ్వాగ్ ట్వీట్‌ చేశాడు. కాగా  జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 22 పరుగులు చేశాడు. 19వ ఓవర్ వేసిన ప్రసీద్ కృష్ణ బౌలింగ్‌లో 2ఫోర్లు, 2 సిక్స్‌లుతో  జడేజా  22 పరుగులు రాబట్టాడు. దీంతో   ఒక్కసారిగా మ్యాచ్‌ సమీకరణం  6 బంతుల్లో 4 పరుగులుగా మారిపోయింది. అయితే.. అఖరి ఓవర్‌ వేసిన నరైన్ తొలి ఐదు బంతులకీ మూడు పరుగులే ఇచ్చి శామ్ కరన్ (4), జడేజాని ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. కానీ.. చివరి బంతికి సింగిల్ తీసిన చాహర్.. చెన్నై సూపర్ కింగ్స్‌ని విజయతీరాలకు చేర్చాడు.

చదవండిVirender Sehwag: అతడిని టీ20 వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారో తెలియదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top