ఆఖరి ఓవర్‌ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే

Ravindra Jadeja Stunning Batting In 20th Over In IPL 2021 All Matches - Sakshi

Ravindra Jadeja Stunning Performance Lat Over.. సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ అంటే బాగా ఇష్టమనుకుంటా. కాకపోతే చెప్పండి.. ఎందుకంటే ఐపీఎల్‌ 2021 సీజన్‌లో జడేజా ఆఖరి ఓవర్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా చివరి ఓవర్‌లో 4,4,6తో 14 పరుగులు పిండుకున్నాడు. ఇక ఇప్పటివరకు జడేజా ఈ సీజన్‌లో తాను ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లో 19 బంతులెదుర్కొని 64 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండడం విశేషం.

ముఖ్యంగా ఈ సీజన్‌ తొలి అంచె పోటీల్లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఆఖరి ఓవర్లో నోబాల్‌ సహా మొత్తం 37 పరుగులు పిండుకోవడం సీజన్‌కే  హైలెట్‌గా నిలిచింది. ఇదే జోరును జడేజా రానున్న టి20 ప్రపంచకప్‌లోనూ కనబరిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(60 బంతుల్లో 101, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపగా.. ఆఖర్లో జడేజా 14 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్‌తో 32 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top