#IPL2023Final: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్‌-1 విజేత

Since-2011-9-Out-of-12-Finals Qualifier-1 Has Gone To-Win IPL Title - Sakshi

దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ 16వ సీజన్‌కు ఇవాళ్టితో శుభం కార్డు పడనుంది. పది జట్లు పోటీ పడితే ఆఖరికి రెండు జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం(మే 28న) గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్‌కేలు ఫైనల్లో తలపడుతున్నాయి.ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలవాలని సీఎస్‌కే భావిస్తుంటే.. వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను చేజెక్కించుకోవాలని గుజరాత్‌ పట్టుదలతో ఉంది.

అయితే గడిచిన 15 సీజన్లలో చాలా సందర్భాల్లో క్వాలిఫయర్‌-1లో గెలిచి ఫైనల్‌కు చేరిన జట్టు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవడం విశేషం. 2011 నుంచి 12 సీజన్లలో తొమ్మిదిసార్లు క్వాలిఫయర్‌-1లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన జట్లే కప్పు కొట్టాయి. గత రికార్డుల ప్రకారం 2011 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 9 సార్లు క్వాలిఫైయ‌ర్-1 విజేత‌నే ట్రోఫీని సొంతం చేసుకుంది. కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే క్వాలిఫైయ‌ర్-2 టీమ్ చాంపియ‌న్‌గా నిలిచింది.

అలా చూస్తే ఈసారి గుజరాత్‌ టైటాన్స్‌దే కప్‌ అని కొంతమంది ఫ్యా‍న్స్‌ భావిస్తున్నారు. కానీ ధోనీ సేనను తక్కువ అంచనా వేయలేం. ఐదోసారి కప్‌ గెలుస్తుందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అయితే క్వాలిఫైయ‌ర్ 1 పోరులో అనూహ్యంగా సీఎస్కే చేతిలో ఓడిన గుజ‌రాత్ క్వాలిఫైయ‌ర్ 2 మ్యాచ్‌లో పంజా విసిరింది.

చాంపియ‌న్ ఆట‌తో బ‌ల‌మైన ముంబై ఇండియ‌న్స్‌ను 62 ర‌న్స్‌తో చిత్తు చేసింది.  సొంత‌గ‌డ్డ‌పై గుజ‌రాత్ అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. కానీ, మిస్ట‌ర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ త‌న తెలివైన వ్యూహాల‌తో మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్ప‌గ‌ల దిట్ట‌. దాంతో, విజేత‌గా నిలిచేది ఎవ‌రో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌తో దాదాపు తెలుస్తుంది.

2011 నుంచి విజేతలను ఒకసారి పరిశీలిస్తే..
ఐపీఎల్ 2011 – ఆర్సీబీ క‌ప్పు ఆశ‌ల‌పై సీఎస్‌కే నీళ్లు చల్లింది. వరుసగా రెండోసారి సీఎస్‌కే చాంపియన్‌గా నిలిచింది (క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2012 – కోల్‌క‌తా నైట్ రైడర్స్ తొలిసారి చాంపియ‌న్‌గా నిలిచింది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2013 – ఫైన‌ల్లో ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్‌-2 విజేత)
ఐపీఎల్ 2014 – కోల్‌క‌తా నైట్ రైడర్స్ రెండోసారి చాంపియ‌న్‌గా నిలిచింది. ఫైన‌ల్లో ముంబై ఇండియ‌న్స్‌పై గెలుపొందింది.(క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2015 – ఫైన‌ల్లో ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2016 – డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తొలిసారి క‌ప్పు కొట్టింది. ఫైన‌ల్లో కోహ్లీసేన ఓట‌మి పాలైంది.(క్వాలిఫయర్‌-2 విజేత)
ఐపీఎల్ 2017 – ముంబై ఇండియ‌న్స్‌ ఫైన‌ల్లో రైజింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌పై గెలిచి ట్రోఫీ అందుకుంది.(క్వాలిఫయర్‌-2 విజేత)
ఐపీఎల్ 2018 – చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ఫైన‌ల్లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై గెలిచింది.(క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2019 – ముంబై ఇండియ‌న్స్‌ ఫైన‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్పై గెలిచింది.(క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2020 – ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ముంబై ఇండియ‌న్స్‌ ఐదోసారు ట్రోఫీని ముద్దాడింది.(క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2021 – చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్రోఫీ అందుకుంది. ఫైన‌ల్లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను చిత్తు చేసింది.(క్వాలిఫయర్‌-1 విజేత)
ఐపీఎల్ 2022 –  క్వాలిఫైయ‌ర్ 1లో గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ ఆరంగేట్రం సీజ‌న్‌లోనే చాంపియ‌న్‌గా నిల‌చింది. ఫైన‌ల్లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను ఓడించింది.(క్వాలిఫయర్‌-1 విజేత)

చదవండి: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top