పేదలకు ధీమా.. ఇందిరమ్మ బీమా | - | Sakshi
Sakshi News home page

పేదలకు ధీమా.. ఇందిరమ్మ బీమా

Nov 18 2026 11:01 AM | Updated on Nov 18 2026 11:01 AM

● 19న ప్రజలకు అంకితం చేయనున్న సీఎం ● మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ● సీఎం సభా ఏర్పాట్లపై మంత్రి ఆరా

● 19న ప్రజలకు అంకితం చేయనున్న సీఎం ● మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ● సీఎం సభా ఏర్పాట్లపై మంత్రి ఆరా

సిద్దిపేటజోన్‌: దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ఈ నెల19న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అంకితం చేయనున్నారని, ఇది పేద ప్రజలకు ఎంతో భరోసా ఇస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం సీఎం సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు. సభకు భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. ఈనెల19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సీఎం సభకు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌, మాన కొండూరు, సిరిసిల్ల, వేములవాడ, జనగామ, మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు సభకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం మూడేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌ రెడ్డి సభలో వివరించి, భవిష్యత్తు ప్రణాళికల దిశానిర్దేశం చేయనున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్‌, ప్రభుత్వ సలహాదారు హన్మంతరావు, ప్రభుత్వ విప్‌ వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్యే సత్యనారాయ ణ, కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌,గ్రంధాలయసంస్థ చైర్మన్‌ చంద్రం, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి హరికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అత్తు, మహేందర్‌, రియాజ్‌, రాజబహుదూర్‌ రెడ్డి, ఎల్లం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement