మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే వినతి
దుబ్బాక: నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై వివరించారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దుబ్బాక, తొగుట, భూంపల్లి మండలాల్లో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం చేయాలన్నారు. దీంతో స్పందించిన మంత్రి వెంకట్‌రెడ్డి రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
ఎరువు దుకాణాల తనిఖీ
చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంతో పాటు మండల పరిధిలోని ముస్త్యాల గ్రామంలోని పలు ఎరువుల దుకాణాలను డీఏఓ స్వరూపరాణి తనిఖీ చేశారు. మంగళవారం ఏఓ ఆఫ్రోజ్‌తో కలిసి స్థానిక సరస్వతి ఎరువుల దుకాణం, ముస్త్యాల గ్రామంలోని శ్రీనివాస, హనుమాన్ ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆమె షాపు యజమానుల కు యూరియా, డీఏపీ అధిక ధరలకు అమ్మవ ద్దని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర్లు, మినుములు, నువ్వులు, పొద్దు తిరుగుడు, కుసుమ, వేరుశనగ పంటలు వేయాలని కోరారు.
పాత పెన్షన్
సాధించే వరకు పోరాటం
గజ్వేల్: పాత పెన్షన్‌ను సాధించే వరకు పోరాటాలు ఆగవని టీఎస్‌సీపీఎస్‌ఈయూ (తెలంగాణ స్టేట్ కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లికార్జున్ అన్నారు. మంగళవారం సీపీఎస్‌ఈయూ పిలుపుమేరకు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఆవరణలో వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధర్మ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యకమంలో మలికార్జున్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా కోశాధికారి ఎల్మ రాజు, గజ్వేల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, ప్రవీణ్‌చారి, నాయకులు నరేష్‌చారి తదితరులు పాల్గొన్నారు.
విచారణ చేపట్టాలి
బెజ్జంకి(సిద్దిపేట): సిద్దిపేట వెటర్నరీ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ప్రజ్వేష్ డిమాండ్ చేశారు. బెజ్జంకిలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రేం, సాయి, చరణ్‌తేజ, హర్షిత్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): మల్టీ నేషనల్ కంపెనీల మెగా జాబ్‌మేళాను ఈ నెల 19న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాదేవి మంగళవారం తెలిపారు. ఈ జాబ్‌మేళాకు మల్టీ నేషనల్ కంపెనీలు విప్రో, కాగ్నిజెంట్, పీస్కాన్, అపోలో తదితర కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు తగిన విద్యార్హతల ధ్రువపత్రాలతోపాటు ఆధార్, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలతో 19న ఉదయం 9గంటలకు వెంట తెచ్చుకోవాలన్నారు.


