పింఛన్ల పంపిణీలో రసాభాస | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో రసాభాస

Nov 18 2026 11:01 AM | Updated on Nov 18 2026 11:01 AM

● ప్రొటోకాల్‌ వివాదంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట ● అర్ధంతరంగా వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్యే

● ప్రొటోకాల్‌ వివాదంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట ● అర్ధంతరంగా వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్యే

చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ రసాభాసగా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్‌పై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మొదటగా కార్యక్రమం సజావుగా ప్రారంభమైనప్పటికీ వేదికపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం మాటామాటా పెరగడంతో ఇరువర్గాల నాయకులు పరస్పరం తోపులాటకు దిగారు. దీంతో కార్యక్రమం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేసి ఇరువర్గాల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ పరిణామాలతో అసహనానికి గురైన ఎంపీ చామల, ఎమ్మెల్యే పల్లా లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు. అనంతరం ఎంపీడీఓ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, మున్సిపల్‌ పరిధిలోని వార్డు ఆఫీసర్లు, కౌన్సిలర్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పేదలకు ఆసరాగా నిలవాల్సిన పంపిణీ కార్యక్రమం రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుకు వేదికగా మారడం చర్చనీయాంశంగా మారింది.

అర్హులందరికీ అందిస్తాం

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ అందించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. కొందరు గొడవలు సృష్టించి కార్యక్రమానికి ఆటంకం కలిగించాలని చూశారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అధికారులు పెన్షన్లు అందిస్తారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement