సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 18 2026 11:01 AM | Updated on Nov 18 2026 11:01 AM

● అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్‌ హైమావతి

● అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటరూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడమేకాక, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవా రం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో గురువారం ముఖ్యమంత్రి సిద్దిపేటలో పర్యటించనున్న నేపథ్యంలో కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సాధన రష్మి పెరుమాళ్‌తో కలిసి కలెక్టర్‌ అధికారులతో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన పనులను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. సీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, సిద్దిపేట హుస్నాబాద్‌ ఆర్డీవోలు, పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement