సీఎం సభ ఉండటం సంతోషం
డీసీసీ మహిళా అధ్యక్షురాలు రేణుక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): డీసీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియామకమయ్యాక మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన జిల్లాలో ఉండటం సంతోషంగా ఉందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుక తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో గాంధీభవన్‌లో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ చేతుల మీదుగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియామక పత్రాన్ని రేణుకు అందుకున్నారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ...ఈ నెల 19న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. తనను జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియామకం అవ్వడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
రామకృష్ణ మఠం వైద్య
శిబిరానికి స్పందన భేష్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో రామకృష్ణ మఠం ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిచింది. సోమవారం జిల్లా కేంద్రంలో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో గ్రామశ్రీ అనే కార్యక్రమంతో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్లు డాక్టర్ కృష్ణారెడ్డి (ఆర్థో), డాక్టర్ క్రాంతి కుమార్ (జనరల్), డాక్టర్ శిరీష(గైనిక్), డాక్టర్ వేణు కోటా(పీడియాట్రిక్), డాక్టర్ మాధవి (కంటి వైద్యం), డాక్టర్ ఐత లింగమూర్తి(పీడియాట్రిక్), శ్రీరామకష్ణ సేవాసమితి బాధ్యులు నాగేందర్, రాజేశ్వర్‌లు పాల్గొన్నారు.


