జిల్లాకు 6,653 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా కేటాయింపు చేశాం. ఇప్పటివరకు 90% వరకు ప్రజలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా అయ్యింది. మరో రెండు రోజుల్లో పూర్తిశాతం కోటా పూర్తి అవుతుంది. ఈ నెలలో చాల తక్కువ రోజుల్లోనే బియ్యం కోటా వేగంగా పూర్తి అయింది.
–బ్రహ్మారావు, డీఎస్‌ఓ
వారం రోజుల్లోనే పూర్తికోటా
నా షాపునకు 140 క్వింటాళ్ల బియ్యం కోటా ఉండగా కేవలం వారం రోజుల్లోనే పూర్తిగా ఖాళీ అయ్యింది. బియ్యం ధరలు బయట మార్కెట్లో పెరగడంతోనే అయిపోతే మళ్లీ దొరుకతాయే లేదోనన్న ఆందోళనతో జనం క్యూ కట్టి ఈసారి బియ్యం తీసుకెళ్లారు.
–నర్సింహులు, రేషన్ డీలర్ దుబ్బాక


