మంత్రి పర్యటనలో వివేక్‌కు చేనేత కార్మికుల నిరసన సెగ తగిలింది. సభ పూర్తయిన అనంతరం మంత్రి వివేక్ వెళ్తుండగా గేటు వద్ద దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు ఆధ్వర్యంలో కార్మికులు తమకు పింఛన్లు ఇవ్వాలంటూ ప్ల కార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సైతం వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. చేనేత కార్మికులు నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న మంత్రి వివేక్ తన వాహనం దిగి వారివద్దకు రాగా... చేనేత కార్మికులకు పింఛన్లు రావడంలేదని మధు, ప్రభాకర్‌రెడ్డి పరిస్థితిని వివరించి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ చంద్రం, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, ఆర్డీఓ సదానందం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


