కలెక్టర్ హైమావతి
సిద్దిపేటజోన్: ఈ నెల19న సీఎం సభ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం ఆమె పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిన్నగుండవెళ్లి రోడ్డు మార్గంలో 16 ఎకరాల్లో జరుగుతున్న సభ వేదిక పనులను గూర్చి ఆరా తీశారు. స్థలాన్ని చదును చేసి వాటరింగ్ చేయాలని సూచించారు. బారికేడింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, వేదిక నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ ప్రక్రియ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ హరికిరణ్, అధికారులు ఉన్నారు.


