● చేయూత ఫించన్ల పంపిణీలో మంత్రి వివేక్ ● అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యత ● మంత్రి వివేక్‌కు చేనేతల నిరసన సెగ
సిద్దిపేట జోన్/దుబ్బాక/దుబ్బాకరూరల్/గజ్వేల్: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి, మహిళలు, కార్మికులు ఇతరులు పింఛన్ల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారని వారి కల ఇప్పుడు నేరవేరిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ తెలిపారు. అక్బర్‌పేట భూంపల్లి మండలం నగరం చౌరస్తా వద్ద గల శ్రీరామలింగేశ్వరస్వామి ఫంక్షన్‌హాల్‌లో చేయూత పింఛన్లు, రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ...నియోజకవర్గంలో 1,924 నూతన పింఛన్లు, 523 రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు అందిస్తామని ఎవరూ అధైర్య పడకూడదని ధైర్యం చెప్పారు. మొదటి విడతలో 3,500ల ఇందిరమ్మ ఇళ్లు, రెండో విడతలో 2వేలు ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలని, నియోజకర్గంలో పెండింగ్‌లో ఉన్న ఉప కాలువలను పూర్తి చేయాలన్నారు. రోడ్ల మరమ్మతుకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.20కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.
పట్టణ సమస్యలను పరిష్కరించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ చందన
గజ్వేల్ పట్టణంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ను స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ చందన కోరారు. సోమవారం గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో చేయూత పెన్షన్‌ల పంపిణీలో మంత్రి పాల్గొన్న సందర్భంగా వినతి పత్రం అందించారు.


