విగ్రహానికి అనుమతి ఇవ్వొద్దు: బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

విగ్రహానికి అనుమతి ఇవ్వొద్దు: బీఆర్‌ఎస్‌

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

తెలంగాణ తల్లి చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్‌కుమార్‌, ఎస్‌ఐ కీర్తిరాజులకు బీఆర్‌ఎస్‌ దుబ్బాక మున్సిపల్‌ అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్‌, యూత్‌ అధ్యక్షుడు దొమ్మాట భూపాల్‌, పడాల నరేశ్‌ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు. దుబ్బాకలో తెలంగాణతల్లి–బీజేఆర్‌ చౌరస్తాలో ఇప్పటికే బాబు జగ్జీవన్‌రామ్‌, తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయని వీటి మధ్యలో ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. దుబ్బాక ప్రశాంతతను, సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తే కాంగ్రెస్‌ నాయకులకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement