ఒకరి మృతి
మర్కూక్(గజ్వేల్): అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మర్కూక్ మండలం గణేశ్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ యూనస్ హైమద్ అలీ వివరాల ప్రకారం.. జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన మార్కంటి రామ్‌రెడ్డి(45) గురువారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రామ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


