బెజ్జంకి(సిద్దిపేట): కథలు రాయడం ఒక కళ అని బాల సాహితీవేత్తలు వర్కోలు లక్ష్మయ్య, బైతి దుర్గయ్య అన్నారు. బెజ్జంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం రాష్ట్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో బాల సాహిత్య కార్యశాల కార్యక్రమాన్ని ఇన్‌చార్జి హెచ్‌ఎం నాగయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ కథలు రాయడం ద్వారా సృజనాత్మకత వికాసం పెంపొందుతుందన్నారు. రాష్ట్ర సారస్వత పరిషత్ ముద్రించిన రచనా కళ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


